పాన్ మసాలా, గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు జీఎస్టీ విభాగం భారీ షాక్ ఇచ్చింది. ఆయా ఉత్పత్తుల ప్యాకింగ్ మెషినరీని తప్పనిసరిగా జీఎస్టీ పరిధిలో నమోదు చేసుకోవాలని,
అలా చేసుకోకపోతే రూ.లక్ష జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర జీఎస్టీ చట్టానికి సవరణలను చేసినట్లు పేర్కొంది.