మూడు రోజులుగా చిలీని అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. ఇప్పటివరకు 112 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 1,600 మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు. 1931లో స్థాపించిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ కాలిబూడిదైంది. మంటల తీవ్రత అధికంగా ఉన్న వియా డెల్ మార్ పట్టణంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ రెండు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు.