అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పరిపాలన సౌలభ్యం కోసం రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు.
దిగువ సుబంసిరి నుండి కీ పన్యోర్ జిల్లాను.. తూర్పు మరియు పశ్చిమ కమెంగ్ జిల్లాల నుండి బిచోమ్ను విభజించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం, ఈశాన్య రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఇప్పుడు 28కి పెరగనుంది.