ఏపీలో కొత్త ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గృహ నిర్మాణ సంస్థ ఎండీ వెంకట రమణా రెడ్డి తెలిపారు. 2.32 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికి 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. లబ్ధిదారులకు అందించే రుణాలు వెంటనే మంజూరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.