మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హర్దా జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బైరాగఢ్ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది.
ఈ పేలుడు ధాటికి సుమారు 20మంది గాయపడినట్లు అంచనా. చాలా మంది ప్రజలు అక్కడ మంటల్లో చిక్కుకుపోయారు. పేలుడు సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.