తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "వైఎస్ఆర్ వల్లే రాజకీయాల్లోకి వచ్చా. ఆయన వల్లే ఎమ్మెల్యేని అయ్యాను. 40 ఏళ్లుగా ఆ కుటుంబాన్ని అంటిపెట్టుకునే ఉన్నాను. కొన్నికారణాల వల్ల మడకశిరకి కొత్త ఇంఛార్జిని నియమించారు. పార్టీ మారే ప్రసక్తే లేదు, పార్టీకి వ్యతిరేకం కాదు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ఆపాలి." అని స్పష్టం చేశారు.