ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జేసీ కేతన్ గార్గ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తహసీల్దార్, ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎలక్షన్ ట్రైనర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ తహసీల్దార్ ఎంపీడీవో, ఎస్సైలు మండలంలోని ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని. రాబోవు ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఎలక్షన్ నియమావళి అనుగుణంగా పని చేయాలన్నారు.