కళ్యాణదుర్గం పట్టణంలోని ఉన్నం క్యాంప్ కార్యాలయం నందు శెట్టూరు మండల నాయకులు, కార్యకర్తలతో మంగళవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉన్నం మారుతి చౌదరి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి మనం కూడా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. గ్రామాల్లో చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకుని అందర్నీ కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.