ఆఫ్రికా దేశం జాంబియాను కలరా వ్యాధి కలవరపెడుతోంది. వేలాది మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 600 మంది ప్రాణాలు కోల్పోయారు.
15 వేల మందికి పైగా ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆ దేశంలోని పది ప్రావిన్స్‌లలో తొమ్మిదింటిలో ఈ వ్యాధి వ్యాపించింది. ప్రభుత్వం స్టేడియాల వద్ద తాత్కాలిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసింది.