బ్యాటింగ్‌లో భారత్ బాగా మెరుగుపడాల్సి ఉందని మాజీ ఆటగాడు జహీర్‌ఖాన్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటడం వల్లే జట్టు గెలిచిందని, రాబోయే టెస్టుల్లో సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ’ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను చూస్తే ఒకే అర్ధసెంచరీ నమోదైంది. కానీ 300కు దగ్గరగా స్కోరు చేసింది. వారిలా మనవాళ్లు కూాడా సమిష్టిగా ఆడాలి‘ అని జహీర్ కోరాడు.