కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై క్రిమినల్ కేసు బుక్ చేయాలని బెంగుళూరు స్పెషల్ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది. కాంగ్రెస్ ఐటీ సెల్ నేత బీఆర్ నాయుడుపై కూడా కేసు పెట్టాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేసిన ఫోటోను మార్పింగ్ చేసి, సోషల్‌మీడియాలో పోస్టు చేసిన కేసులో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.