ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.71,740 కోట్లు కేటాయించి రికార్డు సృష్టించింది ప్రభుత్వం. రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో నాలుగు ఓడ రేవుల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి బుగ్గన ప్రకటించారు.