రాప్తాడు మండలం రాచానపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరారు. వారికి మాజీ మంత్రి పరిటాల సునీత పార్టీ కండువా వేసి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ గువ్వల రమణారెడ్డి, గువ్వల ప్రతాప్ రెడ్డి, గువ్వల ప్రవీణ్ కుమార్ రెడ్డి, గువ్వల కృష్ణారెడ్డి, పాపంపేట పంచాయతీకి చెందిన ముత్యాల రెడ్డి, విజయమ్మ, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.