ప్రధాని నరేంద్ర మోడీ కులంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఒడిశాలోని ఝార్సుగూడలో రాహుల్ మాట్లాడారు.
ప్రధాని మోడీ ఓబీసీ క్యాటగిరీలో జన్మించలేదని, గుజరాత్లోని తేలి కులంలో ఆయన జన్మించారని చెప్పారు. 2000 సంవత్సరంలో ఆ కులాన్ని బీజేపీ ఓబీసీ క్యాటగిరీలో చేర్చిందని అన్నారు. మోడీ సాధారణ కులంలోనే జన్మించారని, స్వతహాగా ఓబీసీ కాదని రాహుల్ గాందీ ఆరోపించారు.