పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు హోంశాఖ ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు.
అయితే, పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. ఈ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపింది. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.