వాలెంటైన్స్ వీక్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది . ఇవాళ మూడో రోజు (ఫిబ్రవరి 9) ని చాక్లెట్ డే అంటారు. ప్రేమ జంటలు ఒకరికొకరు చాక్లెట్లు పంచుకునే రోజు ఇది.
తమ ప్రేమలోని చేదు అనుభవాలను మర్చిపోయి తీపి జ్ఞాపకాలనే గుర్తుపెట్టుకోవాలని ఇష్టమైన వారికి చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. ప్రేమలాగే చాక్లెట్లు తీపి, రుచికరమైనవి. ఇవి ప్రేమికులకు మధురమైన జ్ఞాపకాలను మిగుల్చుతాయి.