ఈ నెల నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో పెళ్లిళ్ల సీజన్ షురూ కానుంది. శనివారం నుంచి మాఘమాసం వచ్చేస్తోంది. దీంతో వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు జరుగనున్నాయి.
ఈ నెల 11 నుంచి ఏప్రిల్ 4 వరకు పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తున్నారు. అయితే ఈసారి ఉగాది దాటిన తర్వాత రెండు నెలలపాటు శుభ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతున్న ముఢం జూలై 10 వరకు ఉండటంతో శ్రావణమాసానికి కొందరు వాయిదా వేసుకుంటున్నారని పండితులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa