మాజీ మంత్రి , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ YCPఇంచార్జి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావుపై ఎన్నికల సంఘానికి TDPనేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయవాడ సెంట్రల్‌లో వెల్లంపల్లి పాదయాత్ర, పర్యటనలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో మహిళలకు ఆయన కుక్కర్లు పంపిణీ చేశారని TDPనేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎన్నికలసంఘం అధికారులకు అందజేశారు. ఎన్నికలకు ముందే ప్రజలను వెల్లంపల్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa