గోవా, హర్యానాలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఫిబ్రవరి 13న తన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశాన్ని నిర్వహించనుంది."ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశం ఫిబ్రవరి 13 న జరుగుతుంది. ఈ సమావేశంలో గోవా, హర్యానా మరియు గుజరాత్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను నిర్ణయిస్తారు అని తెలిపారు. ఈ సమావేశానికి కేజ్రీవాల్ సహా ఆప్ సీనియర్ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 117 స్థానాలకు గాను 92 స్థానాలను కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. ఢిల్లీలోనూ ఆ పార్టీ అధికారంలో ఉంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 62 స్థానాలను ఆప్ గెలుచుకుంది. బీజేపీకి కేవలం 8 సీట్లు రాగా, కాంగ్రెస్‌తో సహా మిగిలిన పార్టీలు ఖాళీగా నిలిచాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ఓటర్లతో మమేకమయ్యేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.