దక్షిణకొరియాకు చెందిన Booyoung కంపెనీ తన ఉద్యోగులకు బంపరాఫర్ ఇస్తోంది. ఆ దేశంలో కొంత కాలంగా జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు బిడ్డ పుడితే Booyoung కంపెనీ రూ.62 లక్షలు ఇస్తోంది.
2021 నుంచి ఇప్పటివరకు 71 మంది ఉద్యోగులకు ఇలా బోనస్ చెల్లించింది. దీని కోసం కంపెనీ రూ.43.65 కోట్లను ఇప్పటి వరకు వెచ్చించింది. సంస్థ ఉద్యోగులలో మహిళలకు, పురుషులకు ఇలా బోనస్ అందిస్తోంది.