ఆర్థిక మోసాలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆర్థిక సేవల రంగం, సైబర్ దాడులపై కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మోసాల సంఖ్య పెరుగుతోందని, వీటిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.