రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఏం మోసం చేయడానికి సిద్ధం అంటోందని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.8లక్షల కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం బటన్ నొక్కడానికి రూ.2.50లక్షల కోట్లు ఖర్చు చేసిందని, మిగిలిన రూ.5.50లక్షల కోట్లు ఏం చేసిందని నిలదీశారు. ఆ లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా తుని బహిరంగ సభ, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చాగల్లు ఎస్సీ పేట రచ్చబండలో షర్మిల ప్రసంగించారు.