‘‘అనేక ఏళ్లుగా పనిచేస్తున్న విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయకుండా ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మడమ తిప్పారు. రెండు రోజులుగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం.’’ అని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మి కులందరినీ సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని విజయవాడ ధర్నాచౌక్‌లో శుక్ర వారం కార్మికులు మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొని కార్మికులకు ఓబులేసు సంఘీభావం తెలిపారు. కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యు లర్ చేయాలని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల క్రమబ ద్ధీకరణ సాధన కమిటీ నేతలు ఎం.బాలకాశి, కట్ట నాగరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం స్పందించకుంటే ఈ నెలాఖరున విద్యుత్‌సౌధ ఎదుట ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.