భారత్, శ్రీలంక మధ్య కొన్నేళ్లుగా మత్స్యకారుల అంశం సమస్యగా మారింది. భారత మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేయడంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు.
జాలర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. మత్స్యకారులను విడుదల చేయడంపై కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలను వేగవంతం చేయాలని కోరారు.