జనసేన కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. ‘‘పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్దు. జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యం.
విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు. పొత్తులపై సందేహాలుంటే నా రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురండి’’ అని అన్నారు.