మూడో దఫాలో పేదరికాన్ని నిర్మూలించి దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కొత్త పథకాలు తీసుకువస్తామని చెప్పారు. తమ పార్టీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
గత ఏడాదిన్నర కాలంగా కొత్త పథకాలకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నాం. వివిధ మార్గాల ద్వారా సుమారు 15 లక్షల మంది నుంచి సలహాలు తీసుకున్నారు. మరో 20-30 రోజుల్లో ఖరారు కానుంది’’ అని మోదీ చెప్పారు.