పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను లోక్సభ ఎన్నికలలోపే అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఈటీ బిజినెస్ సమ్మిట్లో పాల్గొని ఆయన మాట్లాడారు.
2019లో తయారు చేసిన సీఏఏ చట్టాన్ని రాబోయే లోక్సభ ఎన్నికలలోపే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. సీసీఏ గురించి ముస్లింలకు తప్పుదోవ పట్టించారని, వాళ్లను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.