మన దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్తగా దాదాపు 2 కోట్ల మంది యువ ఓటర్లను జాబితాలో చేర్చినట్లు ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు (96.88 కోట్ల మంది) రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. 88.35 లక్షల మంది దివ్యాంగులు తమ ఓటు వేయనున్నారు. దేశంలో మొత్తం మీద 36,88,21,826 కోట్ల మంది అర్హత కలిగిన ఓటర్లు ఉండగా, వీరిలో 49.72 కోట్ల మంది పురుషులు, 47.15 కోట్ల మంది మహిళలు ఉన్నారు.