ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సతీమణి సుప్రియ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళుతున్నారు. శనివారం ధర్మవరం పట్టణంలోని ఐదు ఆరు వార్డులలో కలియ తిరుగుతూ ప్రజలను మహిళలను పలకరిస్తూ వైయస్సార్సీపీ చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను వివరించింది. వైకాపా ప్రభుత్వంలో మంచి జరిగి ఉంటే ఓటు వేయమని అభ్యర్థించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాచర్ల లక్ష్మి తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.