నార్పల మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రమాదపు అంచున ఉన్నారని శనివారం సీపీఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రక్కనే ప్రమాదకరస్థాయిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉన్నదని విద్యార్థులు లోపలికి బయటికి వచ్చేటప్పుడు ఏ కొంచెం ఏమరపాటు ఉన్న భారీ ప్రమాదం తప్పదని తెలిపారు.