కనగానపల్లి మండలం తగరకుంట వెలసిన గులగాని వెంకటరమణ స్వామి ఆలయంలో మాఘమాస సందర్భంగా శనివారం ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రమణయ్య స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నీలం సదానందరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అశేష భక్తజనం పాల్గొని గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.