ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన మస్తాన్ వలి (18) హంద్రీనీవా కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. హైదరాబాదులో నివాసం ఉంటున్న మస్తాన్ అక్కడే సినిమా ఫీల్డ్‌లో సైడ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. గల్లంతైన విషయాన్ని స్థానికులు బంధువులకు తెలిపారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడి కోసం హంద్రీనీవా కాలువ వెంబడి గాలిస్తున్నారు.