గుత్తి ఆర్టీసి బస్టాండులో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి, సహాయ కార్యదర్శి రమేష్, పట్టణ, మండల కార్యదర్శులు రామదాసు, రాజు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక బస్టాండు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ గుత్తి బస్టాండులో యాజమాన్యం ఎక్కువ దుకాణాలు ఏర్పాటు చేసి లాభాలు గడుస్తూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయిందని అన్నారు.