ధర్మవరం పట్టణంలోని కొత్తగా ఓటు హక్కు పొందిన విద్యార్థులతో ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ శనివారం సాయంత్రం ముఖాముఖి సమావేశం అయ్యారు. ధర్మవరం పట్టణం ఎర్రగుంట సర్కిల్ లో ఉన్న టిడిపి కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో శ్రీరామ్ మాట్లాడుతూ కొత్తగా ఓటు హక్కు పొందిన వారందరికీ శుభాకాంక్షలు అని వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్తును కాపాడే వారికే ఓటు వేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa