మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇళ్లు కూల్చివేతపై విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మున్సిపల్ అధికారులు ఆమె ఇంటిని తప్పుగా కూల్చివేశారని పేర్కొన్న న్యాయస్థానం..
సరైన ప్రక్రియ అనుసరించకుండా ఇళ్లు కూల్చివేయడం స్థానిక పాలనా సంస్థలు, అధికారులకు ఫ్యాషన్ అయిపోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. బాధిత మహిళకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.