కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి విరాళాలు పోటెత్తాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) తాజాగా వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం రూ.2,120 కోట్ల విరాళాలు రాగా..
అందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే రూ.1,300 కోట్లు వచ్చాయి. ఇది ప్రతి ప్రతిపక్ష కాంగ్రెస్తో పోలిస్తే ఏడు రెట్లు అధికం. 2021-22లో వచ్చిన రూ.1,775 కోట్ల విరాళాలతో పోలిస్తే రూ.345 కోట్లు అధికంగా వచ్చాయి.