ప్రధాని మోదీ ఈనెల 13, 14న యూఏఈ పర్యటనకు వెళ్లనున్నారు. తొలిరోజున యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు.
అలాగే రాజధాని నగరమైన అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభిస్తారు.ఈ సందర్భంగా అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతారు. దుబాయ్ కేంద్రంగా జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్-2024కు గౌరవ అతిథిగానూ ప్రధాని హాజరై ప్రసంగిస్తారు.