జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అండతో బిహార్లో ఏర్పడిన ఎన్డీఏ సర్కార్ సోమవారం రాష్ట్ర అసెంబ్లీ వేదికగా విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతోంది.
ఈ నేపథ్యంలో నితీష్ ప్లేటు ఫిరాయించడంతో అధికారాన్ని కోల్పోయిన మహాగల్బంధన్ కూటమిలోని పార్టీలు తమ ఎమ్మెల్యేలు పక్కదారి పట్టనివ్వకుండా కాపాడుకుంటున్నారు. ఆర్జేడీకి చెందిన 79 మంది ఎమ్మెల్యేలంతా పాట్నాలోని తేజస్వి యాదవ్ నివాసానికి చేరుకున్నారు.