కొండకర్ల ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జనసేన రాష్ట్ర నాయకుడు కొణిదెల నాగేంద్ర బాబు అన్నారు. శనివారం మండలంలోని కొండకర్ల ఆవలో బోటుపై ఆయన షికారు చేశారు.
ఆవ అందాలను తిలకించారు. ఆవలో బోటు షికారు, విదేశీ పక్షుల రాకపోకలు, చేపల పెంపకం, చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకారులు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులను ఆకర్షించేదుకు పలు కట్టడాలను కట్టాలని సూచించారు. ఆయన వెంట జనసేన నాయకులు ఉన్నారు.