పరిశ్రమల యాజమాన్యాలు లాభాల నుంచి కొంత అభివృద్ధి పనులకు కేటాయించడం అభినందనీయమని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. పరవాడ ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధుల కింద రూ. 32 లక్షలతో గణపర్తి జడ్పీ పాఠశాలలో నిర్మించిన విద్యార్థుల భోజనశాలను
శనివారం ఎన్టీపీసీ సీజీఎం సిన్హాతో కలిపి ఆయన ప్రారంభించారు. సీజీఎం సంజయ కుమార్ మాట్లాడుతూ తమ కంపెనీ సీఎస్ఆర్ గ్రాంటు నుంచి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.