వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్లను నియమించారు. ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి - ఒంగోలు పార్లమెంటు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. వి.విజయసాయిరెడ్డి- గుంటూరు పార్లమెంటు, నర్సారావుపేట పార్లమెంటు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. పి.రామసుబ్బారెడ్డి - కర్నూలు పార్లమెంటు మరియు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. అదే విధంగా కె.సురేష్ బాబు - కడప పార్లమెంటు మరియు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించబడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్ను (సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో పనిచేస్తారు) నియమించారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమించారు.