నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే క్రమంలో దాదాపు 1400 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని స్పైస్‌జెట్ ప్రణాళికలు రూపొందిస్తోంది. గత కొద్దినెలలుగా ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్ వేతన బిల్లులో కోతల దిశగా కొలువుల కోతకు తెగబడుతోంది. లాభదాయకతను మెరుగుపరుచుకునేందుకు మానవవననుల క్రమబద్ధీకరణలో భాగంగా ఈ సంక్లిష్ట నిర్ణయం తీసుకున్నామని స్పైస్‌జెట్ వర్గాలు పేర్కొన్నాయి.