సొంత పార్టీ, సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. 'బీసీలకు పదవులు ఇచ్చారు కానీ, అధికారాలు లేవు.
బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేసే పరిస్థితి పార్టీలో లేదు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. బీసీ వర్గాలు వైసీపీకి దూరమవుతున్నాయి. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు' అని విమర్శించారు.