వైసీపీ తరపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వైసీపీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబురావు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
అంతకుముందు వీరు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిసి.. బీఫాం స్వీకరించారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు.