ఆస్పత్రిలో చేరినవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికంతా న్యుమోనియా ముప్పు ఉన్నట్టేనని ‘జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్’లో ప్రచురితమైన అధ్యయనం తేల్చింది.
నోట్లోని బ్యాక్టీరియా అనుకోని పరిస్థితుల్లో రోగి వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో ఇన్ఫెక్షన్ ద్వారా న్యుమోనియా వస్తుందని తెలిపింది. అయితే, హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులూ క్రమం తప్పక బ్రష్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోచ్చని వెల్లడించింది.