రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలుచేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రేషన్ దుకాణాల్లో మోదీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందా అని అడిగిన ప్రతిపక్ష ఎమ్మెల్యే పి.అబ్దుల్ హమీద్ ప్రశ్నకు ముఖ్యమంత్రి ఈవిధంగా స్పందించారు.