జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి సోమవారం ఉదయం ఎర్రగుంట్ల మండలం నిడిజివ్విలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు ఆయనకు అర్జీలు ఇచ్చారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.