ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైయస్ఆర్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు నలుగురికు రాజ్యసభకు అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసన సభలో అత్యధిక బలం తమకే ఉందని, వైయస్ఆర్సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులం విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్ళీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిను గెలిలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.