దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి నిజమైన వారసుడు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. షర్మిల వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి నేను మీ బిడ్డను, ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నా అని చెప్పారు, ఇప్పుడు పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపారు. జగనన్న పైన విషం చిమ్మడం ధ్యేయంగా షర్మిల పనిచేస్తున్నారు. వైయస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్ ఆశయాలు కోసం పనిచేస్తున్నది కేవలం జగనన్న మాత్రమే. ఇది ఇద్దరి మధ్య తేడా. షర్మిల.. చంద్రబాబు వదిలిన బాణం అంటూ రోజా విమర్శించారు. షర్మిల ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు తెలంగాణ బిడ్డని అన్నారు.. తెలంగాణలో పార్టీ పెట్టి గాలికొదిలేశారు. షర్మిల తెలంగాణలో ఏం చేశారు? ఇప్పుడేం చెబుతున్నారు?. వైయస్ఆర్ బిడ్డ.. వైయస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్పా, ఆయన కోసం చేసింది ఏమీ లేదని మంత్రి రోజా మండిపడ్డారు.