రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి మాట్లాడాలని ప్రతిపక్ష నాయకులకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళని..కళ్లు ఉన్నా చూడలేని వాళ్ళని, చెవులు ఉండి వినలేని వాళ్ళని, నిద్ర నటించే వాళ్లను ఏం అనగలం అని అన్నారు. ఇవాళ రాష్ట్రం కోసం మాట్లాడుతున్న విపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో (పక్క రాష్ట్రంలో) ఉంటున్నారు. ఆయన వ్యాపారాలన్నీ పక్క రాష్ట్రంలో ఉంటే అదనంగా ఇక్కడ సీఎం పదవి కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇవాళ మన రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అంట ! టీడీపీ యువ నాయకుడు లోకేశ్ చెబుతున్నారు. పథకాల అమలులో భాగంగా గ్రామాల్లో ఏనాడైనా వర్గాలు చూశామా ? పార్టీ చూశామా ? ప్రభుత్వం అదించే పథకాలకు అర్హులా ? కాదా ? అన్నదే చూశాం అని తెలిపారు.